మాదో చక్కని ఉమ్మడి కుటుంబం. మా ఇల్లు కేవలం ప్రేమతోనే ఏర్పడింది. ఆప్యాయతలు అనుభందాలు ఉంటే చాలు మాకు ఇంకేం అక్కర్లేదు. నవకాయ పిండి వంటలు తిన్నా కలగని ఆనందం మేమందరం కుర్చుని పచ్చడి మెతుకులు తిన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాం.
నా పసి వయసులో అమ్మా నాన్న మాకోసం మంచి నీళ్ళతో రోజులు గడిపిన క్షణం మాకు తెలుసు. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నాన్నకు ఉద్యోగం పోతే అమ్మ బయటకు వెళ్ళి ఇంటిని పోషించింది.. ఆరోజు నాన్న బాధపడలేదు "ఆడదాని జీతం మీద బతుకుతున్నానే" అని.. ఇంకా గర్వపడ్డాము అమ్మను చూసి.. తరువాత నేను ఇళ్ళిల్లు తిరిగి టీపొట్లాలు అమ్మి సంపాదించి తెచ్చిన రోజు అది నా భాద్యత అనుకున్నా.. ఇప్పుడు నేను సంపాదన పక్కనపెట్టి మళ్ళీ చదువుల్లో కి వొచ్చినప్పుడు "నువ్వూ కానీఈ మేమున్నాం.." అంటూ నా వెంటే నిలిచి ధైర్యం చెప్పారు మా కుటుంబం. ముఖ్యంగా మా తమ్ముడు.. అలాగె రేపొద్దున ఇల్లు భారం మోత్తం నా మీదే పడినా నేను బాధపడను.. ఇంకా అదృష్టంగా భావిస్తా..
ఇప్పటికీ ఇంట్లో నాన్నగారే పెద్ద.. ఎప్పటికీ ఇంటి పెద్ద ఆయనే.. మేమందరం ఆయన చెప్పినట్లుగానే నడుస్తాం. అలాగే ఆయన మా భావాలకి ఎప్పుడూ విలువనిస్తారు. డబ్బులు ఎవరు సంపాదించారు అని మేము ఆలోచించం.. ఇంట్లో రూపాయ్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఖర్చుపెట్టుకోవచ్చు..
ఇది నేను సంపాదించాను, ఇది నువ్వు సంపాదించావు, ఇది నాది, ఇది నీది అని మాకు ఏమీ ఉండవు.. ఇవి మనవి.. అనేదే ఉంటుంది..
"మాట తూటా వంటిది" అనేది మేము నమ్మే సిద్ధాంతం. అందుకే ప్రతీ మాట పట్టించుకుంటాం కాబట్టే ఆచి తూచి మాట్లాడుతాం..
మన ప్రవర్తన మనకి మాత్రమే కాదు మన కుటుంబానికీ ప్రభవం చూపుతుంది కాబట్టి నడత మీద నడక మీద చాలా శ్రద్ధ తీసుకుంటాం.
"తప్పు చేస్తే ధైర్యంగా ఒప్పుకుంటాం, తప్పు చెయ్యనప్పుడు ఎవ్వరికీ భయపడం."
ఇదండీ క్లుప్తంగా మా ఇంటి పద్దతి.. మిగిలిన విషయాలు ఇంకో పోస్టులో చెప్తాను.. ఉంటానూ.. బాయ్..